కామారెడ్డి, అక్టోబర్ 16
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంను ఆదివారం హైదరాబాద్ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థులు క్షేత్ర పర్యటనలో భాగంగా సందర్శించారు. కలెక్టరేట్ భవనం మ్యాప్‌ను పరిశీలించారు.
భవనంలోని వివిధ డిపార్ట్మెంట్ల భవనాలను చూశారు. అనంతరం సమావేశం మందిరంలో ఆర్ అండ్ బి డి ఈఈ జాలిగామ శ్రీనివాస్, ఏఈఈ రవితేజ, వక్త ఉష రెడ్డి సముదాయంలో ఉన్న వివిధ కార్యాలయాలు నిర్మించిన విధానాన్ని తెలియజేశారు.
ప్రతి సోమవారం సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమం జరుగుతోందని తెలిపారు. ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తారని చెప్పారు. అన్ని శాఖల శాఖల అధికారులు హాజరవుతారని పేర్కొన్నారు.