నిజాంసాగర్, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కోటగిరి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ సెకండరీ పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. ఫుడ్ ఫెస్టివల్ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు వివిధ రకాలైన వంటకాలు స్వయంగా చేశారు. ఉదయం టిఫిన్ ఇడ్లీ వడ, పునుగులు, బజ్జీలు, ఉప్మా తదితర పదార్థాలు తయారుచేసి తల్లిదండ్రులకు ఆకర్షింప చేశారు.
విద్యార్థులు మధ్యాహ్న భోజనంలో భాగంగా జొన్న రొట్టెలు, మక్కా రొట్టెలు, వెజ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ లాంటి వంటకాలు చేసి గ్రామస్తులకు ఆనందింపజేశారు. స్వీట్ పదార్థాలు గులాబ్ జామ్, డబుల్ కా మీఠా, ఫ్రూట్ సాలిడ్, రసగుల్లా, తినుబండరాలను రుచిచూపించారు. వైస్ ఎంపీపీ వల్లేపల్లి శ్రీనివాసరావు వాటిని రుచి చూసి చాలా బాగున్నాయని విద్యార్థులను అభినందించారు.
విద్యార్థులు నిర్వహించిన ఫెస్టివల్ కోటగిరి గ్రామస్తులు తండోప తండాలుగా వచ్చి తిలకించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు గాల్లప్ప, స్కూల్ యాజమాన్య కమిటీ చైర్మన్ పోశెట్టి, ఉపాధ్యాయులు పిడి సాయిబాబా, శ్రీనివాస్ రెడ్డి, ఆదినారాయణ, సిరాజ్, లతా ప్రణీత, నజముద్దీన్, సంధ్య, కరుణ, విజయ, నిర్మల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.