కామారెడ్డి, అక్టోబర్ 17
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు జిల్లాలోని పంచాయతీలు పోటీపడాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు.
కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో పంచాయతీ అధికారులు కార్యదర్శిలతో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో సమీక్షించారు. జిల్లాలో 526 పంచాయతీలు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. 9 కేటగిరిలో అవార్డుల ఎంపిక ఉంటుందని వెల్లడిరచారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ లు ఉంటాయని తెలిపారు.
పేదరిక నిర్మూలన, మెరుగైన జీవనవిధానం గల గ్రామపంచాయితీ,ఆరోగ్య గ్రామపంచాయితీ,పిల్లలకు స్నేహ పూర్వక గ్రామ పంచాయితీ, సమృద్ది జలసిరుల గ్రామ పంచాయితీ, స్వచ్చ, హరిత గ్రామ పంచాయితీ, మౌలిక వాసతుల్లో స్వయం సమృద్ది గ్రామ పంచాయితీ, సామాజిక భద్రతలో మేటి గ్రామ పంచాయితీ, గుడ్ గవర్నెన్స్ (పాలనలో పారదర్శక గ్రామ పంచాయితీ), మహిళా స్నేహశీలి గ్రామ పంచాయితీ తదితర 9 కేటగిరిలలో పోటీలుంటాయని వివరించారు. ఈనెల 10 నుంచి ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమైందని 30న ముగుస్తుందని చెప్పారు.
సంబంధిత ప్రభుత్వ శాఖలు ఆయా ప్రగతి నివేదికలతో పాటు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, నివేదికలు ప్రశ్నావళి ఆధారంగా జోడిరచాలన్నారు. గ్రామస్థాయిలో చైల్డ్ ప్రొటెక్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని సూచించారు. అటవీ భూములను ఎవరైనా ఆక్రమిస్తే వారి వివరాలను పంచాయతీ కార్యదర్శులు రెవెన్యూ అధికారులకు తెలియజేయాలని సూచించారు. క్రీడా ప్రాంగణాలు పూర్తిచేసి వినియోగంలోకి తీసుకురావాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఎస్పీ శ్రీనివాసరెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, డిపిఓ శ్రీనివాసరావు, జెడ్పి సీఈవో సాయ గౌడ్, అధికారులు పాల్గొన్నారు.