Daily Archives: October 18, 2022

పోలీసు అమరవీరుల సేవలు మరువలేని…

రెంజల్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : పోలీసు అమరవీరుల సేవలు మరువలేనివని, విధి నిర్వహణలో అమరులైన అమర జవానుల సేవలు ప్రజలలో చిరస్మరణీయంగా ఉంటాయని ఏసీపీ కిరణ్‌ కుమార్‌ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మోడల్‌ పాఠశాలలో పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని నిర్వహించారు. ప్రజలకు సేవలందించడంలో అంకిత భావం ప్రదర్శిస్తూ పోలీసులు వారి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కుటుంబ సభ్యులకు దూరమయ్యారని ఏసిపి గుర్తు …

Read More »

ఉరివేసుకొని యువకుడి ఆత్మహత్య…

రెంజల్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రెంజల్‌ మండల కేంద్రానికి చెందిన ఓ యువకుడు ఇంట్లో ఎవరు లేని సమయంలో మంగళవారం ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు ఎస్సై సాయన్న తెలిపారు. ఎస్‌ఐ కథనం ప్రకారం రెంజల్‌ గ్రామానికి చెందిన శ్రావన్‌ గౌడ్‌ (29) ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు తాళలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడన్నారు. గత కొంతకాలంగా మృతుడు అనారోగ్యంతో బాధపడుతున్నట్లు స్థానికులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న …

Read More »

కల్కి భగవాన్‌ ఆలయంలో అన్నదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కల్కి ఆలయంలో గత 3 సంవత్సరాలుగా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని మంగళవారం కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఏర్రం చంద్రశేఖర్‌, డాక్టర్‌ బాలు లు మాట్లాడుతూ శ్రీ అమ్మ భగవానుల సూచనల మేరకు 2020 సంవత్సరంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభించడం జరిగిందని నిర్విరామంగా గత 3 …

Read More »

28న మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభ

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఈ నెల 28 న ఏఐటీయూసీ అనుబంధ మెడికల్‌ కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్టు ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వై. ఓమయ్య తెలిపారు. మంగళవారం జిల్లా కార్యాలయంలో ఏఐటీయూసీ రాష్ట్ర మూడవ మహాసభలు పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఓమయ్య మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన మహబూబ్‌ నగర్‌ జిల్లా కేంద్రంలో యూనియన్‌ రాష్ట్ర …

Read More »

నగదు రహిత వైద్యాన్ని అందించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : అన్ని ప్రైవేటు, కార్పొరేట్‌ ఆసుపత్రులలో నగదు రహిత వైద్యాన్ని అందించేలా చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆల్‌ పెన్షనర్స్‌ అండ్‌ రిటైర్డ్‌ పర్సన్స్‌ అసోసియేషన్‌ జిల్లా కమిటీ డిమాండ్‌ చేసింది. మంగళవారం సంఘ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాత్రేయరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో పలువురు నాయకులు మాట్లాడారు. హెల్త్‌ కార్డు నిరుపయోగంగా మారిందని ప్రైవేటు ఆసుపత్రులు అనుమతించడం లేదని, …

Read More »

ఓటరు జాబితాలో మార్పునకు దరఖాస్తులు

కామారెడ్డి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ఓటర్‌ జాబితాలో మార్పులు, చేర్పులు చేయదలచుకున్న వ్యక్తులు ఫారం (8) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్‌ హాల్లో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ఓటరు నమోదు కొరకు ఫామ్‌ (6) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. బూతు లెవెల్‌ అధికారుల వద్ద, …

Read More »

సరైన వసతులులేని కళాశాలలకు అఫిలియేషన్‌ ఇవ్వొద్దు

డిచ్‌పల్లి, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ కామారెడ్డి జిల్లాలో గల కనీస వసతులు లేని బిఈడి కళాశాలలకు అనుమతి ఇవ్వకూడదని వివిధ విద్యార్థి సంఘాలు డిమాండ్‌ చేశాయి. మంగళవారం తెలంగాణ యూనివర్సిటీ వైస్‌ ఛాన్స్లర్‌ రవీందర్‌ గుప్తాకు వినతి పత్రం అందజేశారు. ఏఐఎస్‌ఎఫ్‌, ఎస్‌ఎఫ్‌ఐ, జివిఎస్‌, ఏఐఎస్‌బి విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి …

Read More »

డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : మోపాల్‌ మండలం కంజర గ్రామంలో ఎండీ. తమీమ్‌ అనే ఆదర్శ రైతు సాగు చేస్తున్న డ్రాగన్‌ ఫ్రూట్‌ పంట క్షేత్రాన్ని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి మంగళవారం సందర్శించారు. రసాయనిక ఎరువులకు స్వస్తి పలికి, పూర్తిగా సేంద్రీయ పద్ధతులను అవలంభిస్తూ ప్రయోగాత్మకంగా ఎకరన్నర విస్తీర్ణంలో పండిస్తున్న పంట క్షేత్రాన్ని కలెక్టర్‌ ఎంతో ఆసక్తిగా పరిశీలించారు. డ్రాగన్‌ ఫ్రూట్‌ పండిరచడంలో పాటిస్తున్న …

Read More »

ఆధార్‌ అప్‌ డేట్‌ చేసుకోవాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 18 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : 2010 నుండి 2016 సంవత్సరాల కాలంలో ఆధార్‌ కార్డు పొందిన వారందరూ తప్పనిసరిగా ఆధార్‌ అప్‌డేట్‌ చేసుకోవాలని ఈ-సేవ జిల్లా మేనేజర్‌ కార్తీక్‌ మంగళవారం ఒక ప్రకటనలో సూచించారు. వివిధ ప్రభుత్వ పథకాలకు, బ్యాంకు సేవలకు ఆటంకాలు లేకుండా ఉండేందుకు పైన పేర్కొన్న కాలంలో ఆధార్‌ పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా అప్‌డేట్‌ చేసుకోవాలని తెలిపారు. తమ పేరు, …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »