కామారెడ్డి, అక్టోబర్ 18
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఓటర్ జాబితాలో మార్పులు, చేర్పులు చేయదలచుకున్న వ్యక్తులు ఫారం (8) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం వివిధ రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. కొత్తగా ఓటరు నమోదు కొరకు ఫామ్ (6) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
బూతు లెవెల్ అధికారుల వద్ద, ఓటర్ హెల్ప్ లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చని కోరారు. జిల్లాలో 790 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని చెప్పారు. 1500 లోపు ఓటర్లు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఉన్నారని తెలిపారు. ఎల్లారెడ్డిలో 269, కామారెడ్డిలో 266, జుక్కల్ లో225 పోలీస్ కేంద్రాలు ఉన్నాయని పేర్కొన్నారు.
సమావేశంలో జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్, ఆర్డీవో శీను, తహసిల్దార్ ప్రేమ్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకుడు సాయి భుజంగరావు, నాయబ్ తహసిల్దారులు ప్రియదర్శిని, శ్రావణి, అధికారులు నరేందర్, నవీన్, వివిధ రాజకీయ పార్టీల నాయకులు పాల్గొన్నారు.