కామారెడ్డి, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని అడ్లూరు గ్రామ శివారులోని ధరణి టౌన్ షిప్లో ఇండ్లు (130), ప్లాట్ల (195) విక్రయానికి సంభందించి ఫ్రీ బెడ్ అవగాహన సదస్సు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. గురువారం 11 గంటలకు కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహిస్తామని చెప్పారు. ఆసక్తి గల వ్యక్తులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.