నిజామాబాద్, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : అక్టోబర్ 2 గాంధీ జయంతిన మొదలైన స్వచ్ఛతా పక్వాడా కార్యక్రమంలో భాగంగా బుధవారం నగరంలోని కేర్ డిగ్రీ కళాశాల విద్యార్థులతో కలిసి తిలక్ గార్డెన్‌లో, పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్లాస్టిక్‌ను సేకరించారు.
ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ నరాల సుధాకర్ మాట్లాడుతూ మన అలవాట్లే మన భవిష్యత్‌ను మారుస్తాయని, దేశాన్ని శుభ్రంగా ఉంచడం మనందరి బాధ్యత అని, తెలిసో తెలియకో మనందరం ప్లాస్టిక్ రూపంలో భూమిని కలుషితం చేస్తున్నామని దీనికి నివారణ మన బాధ్యతాయుతమైన ప్రవర్తనే అని సూచించారు.
జిల్లా యువజన అధికారిణి శైలి బెల్లాల్ మాట్లాడుతూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం మన బాధ్యత అని, మనం నిత్యం ఉపయోగిస్తున్న ప్లాస్టిక్‌ను సరైన పద్దతిలో వేరు చేసి సూచించిన చోటనే వేయాలని కోరారు. కార్యక్రమంలో స్వచ్ఛభారత్ ప్రతినిధి రాజు, కేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ బాలక్రిష్ణ, వినయ్, వివేక్, విద్యార్థులు పాల్గొన్నారు.