కామారెడ్డి, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లాలో మొదటి విడతలో 855 ఎకరాల్లో ఆయిల్ ఫామ్ సాగు చేసే రైతులకు బిందు సేద్యం సౌకర్యం ఈ నెల 31 లోగా కల్పించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అన్నారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా ఉద్యానవన శాఖ అధికారులతో బిందు సేద్యం ఏర్పాటుపై సమీక్ష నిర్వహించారు.
ఆయిల్ ఫామ్ సాగుచేసే రైతులకు బిందు సేద్యంపై అవగాహన కల్పించాలని చెప్పారు. రైతుల పొలాల్లో గుంతలను తీయించి బిందు సేద్యం పైపులను అమర్చాలని సూచించారు. బిందు సేద్యం పనులను వేగవంతం చేయాలని పేర్కొన్నారు. సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి విజయ భాస్కర్, విశ్వతేజ ఇండస్ట్రీస్ ప్రతినిధులు, డ్రిప్ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.