డిచ్‌పల్లి, అక్టోబర్ 19
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ రాష్ట్రంలో చిత్తశుద్ధి లేని పాలన కొనసాగుతుందని, వైయస్‌ఆర్ టిటీ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల అన్నారు. బుధవారం డిచ్‌పల్లి మండలం బాలానగర్ క్యాంప్ నుంచి మొదలైన పాదయాత్ర డిచ్‌పల్లి రైల్వే స్టేషన్ మార్కెట్ స్థలంలో వైయస్‌ఆర్ టిపి కార్యకర్తలు, నాయకులు, మహిళలతో కలిసి భారీ బహిరంగ సభ నిర్వహించారు.
ఈ సందర్భంగా షర్మిల ప్రసంగిస్తూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 8ఏళ్ళు గడుస్తున్నా టిఆర్‌ఎస్ పార్టీ గాని, కేంద్ర ప్రభుత్వం బిజెపి పార్టీ గాని ఇప్పటి వరకు ఎలాంటి ఉద్యోగ నోటీపీకేషన్లు విడుదల చేశారని ప్రశ్నించారు. ఎనిమిదేళ్ళ తెరాస పాలనలో ఎవరికి లాభం చేకూరిందని, ఇది ప్రజలకు ఒకసారి ఆలోచించాలని సూటిగా ప్రశ్నించారు. ఎన్నికలకు ముందు దళితుని ముఖ్యమంత్రి చేస్తానన్న హామీ ఏమైందని, విస్మరించారని కెసిఆర్‌పై దుయ్యబట్టారు.
తెలంగాణ రాష్ట్రంలో వైయస్సార్ టిటీ పార్టీ అధికారంలోకి రాగానే ఇంట్లో ఎంత మంది పెన్షన్ ఆర్హులు ఉన్నా అంత మందికి పెన్షన్లు ఎలాంటి ఆంక్షలు లేకుండా ఇస్తామని హామీ ఇచ్చారు. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పేద ప్రజలకు చేయాల్సిన పనులు మిగిలిపోయాయని, ఆ పనులు పూర్తి చేసేందుకు వైయస్‌ఆర్ టిపి పార్టీ తెలంగాణ రాష్ట్రంలో పాదయాత్ర మొదలు పెట్టిందని తెలిపారు.
వైఎస్సార్ చేపట్టిన 108 అంబులెన్స్, ఆరోగ్య శ్రీ కార్డ్, ఏకాకలంలో రైతు ఋణమాపి లాంటి పథకాలు పేద రైతులకు ఎంతగానో ఉపయోగపడ్డాయని, రాజన్న చేసిన సేవలను రోడ్ షో, బహిరంగ సభలో కొనియాడారు. వైఎస్‌ఆర్ టిపి పార్టీ అధికారంలోకి రాగానే గ్రామంలో బీఆర్‌ఎస్, టిఆర్‌ఎస్ నాయకులు అక్రమంగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా పెట్టిన మద్యం బెల్ట్ షాపులను వెంటనే మూసివేయిస్తామని మహిళలకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తిరుపతి రెడ్డి, వైఎస్ ఆర్ టిపి పార్టీ కార్యకర్తలు, మహిళలు, నాయకులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.