Daily Archives: October 20, 2022

మునుగోడు గెలుపు ఓటములు కాదు… రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోండి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : రాష్ట్రంలోనే ధాన్యం దిగుబడిలో అన్నపూర్ణగా జిల్లా ప్రథమ స్థానంలో ఉందని, జిల్లా రైతుల ఖరీఫ్‌ సీజన్‌ పంట కోతల దశలో ఉందని, ధాన్యం కొనుగోలు చేయాల్సిన రాష్ట్ర ప్రభుత్వం మునుగోడు గెలుపు ఓటములను చర్చిస్తూ రాష్ట్ర పాలన గాడితప్పేలా ఉందని బోధన్‌ నియోజకవర్గ భారతీయ జనతా పార్టీసీనియర్‌ నాయకుడు వి.మోహన్‌ రెడ్ది అన్నారు. బుధవారం స్టానిక ప్రెస్‌క్లబ్‌లో విలేకరుల …

Read More »

సైబర్‌ నేరాలపై నేడు అవగాహన కార్యక్రమం

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జాతీయ సైబర్‌ భద్రత అవగాహన మాసంలో భాగంగా ప్రజలకు సైబర్‌ నేరాలపై అవగాహన కల్పించడంతోపాటు సైబర్‌ నేరగాళ్లం చేతుల్లో మోసపోయిన బాధితులకు ఏ విధమైన సహకారం అందించడం జరుగుతుందో, సైబర్‌ నేరాల నియంత్రణకు సైబర్‌ విభాగం తీసుకుంటున్న చర్యలపై ప్రజలు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేసేందుకుగాను జిల్లా ఎస్పీ శ్రీనివాస్‌ ఆదేశాల మేరకు రేపు అనగా 21వ తేదీ …

Read More »

టియు ఫలితాలలో సత్తా చాటిన ఆర్‌.కె. విద్యార్థులు

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : గురువారం ప్రకటించిన తెలంగాణ యునివర్సిటీ ఫలితాలలో ఆర్‌.కె. విద్యార్థులు 10/10 జిపిఎస్‌ సాధించి ప్రభంజనం సృష్టించారు. ఎప్పటిలాగే ఈ ఫలితాల్లో కూడా విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచి 10/10 జిపిఎ సాధించారు. ఈ సందర్భంగా ఆర్‌.కె. కళాశాల సీఈవో డాక్టర్‌ జైపాల్‌ రెడ్డి మాట్లాడుతూ ఆర్‌.కె. విద్యార్థులు ఎంపీసీఎస్‌ విద్యార్థి బి. శ్రీనాథ్‌ రెడ్డి 10/10 జీపీఏ మరియు …

Read More »

ధాన్యం కొనుగోళ్లు జరిపే ట్రేడర్లకు ఆటంకాలు కల్పించకూడదు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లాలో ఖరీఫ్‌ సీజన్‌ కు సంబంధించి రైతులు పెద్ద ఎత్తున సాగు చేసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇతర జిల్లాలు, రాష్ట్రాల నుండి వచ్చే ట్రేడర్లకు ఎవరు కూడా ఎలాంటి ఆటంకాలు కల్పించకూడదని అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌ సూచించారు. ఒకవేళ ఎవరైనా ఆటంకాలు కల్పించినట్లు తమ దృష్టికి వస్తే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్థానిక …

Read More »

జాతీయ స్థాయి అవార్డులకు జీ.పీలు కృషి చేయాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయి అవార్డుల కోసం ఉత్తమ గ్రామ పంచాయతీలను ఎంపిక చేయనున్నందున, జిల్లాలోని మొత్తం 530 జీ.పీలు నామినేషన్‌ చేయాలని కలెక్టర్‌ సి.నారాయణ రెడ్డి సూచించారు. గురువారం సాయంత్రం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి కలెక్టర్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులతో సమీక్ష నిర్వహించారు. జాతీయ స్థాయి అవార్డుల కోసం నిర్దేశించిన తొమ్మిది అంశాల్లోనూ …

Read More »

నవంబర్‌ 14 నుంచి 18 వరకు వేలంపాట

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ధరణి టౌన్షిప్‌ లోని ప్లాట్లు, గృహాలను వ్యక్తులు వేలంపాట ద్వారా సొంతం చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ అన్నారు. కామారెడ్డి కలెక్టర్‌ కార్యాలయంలో గురువారం ఫ్రీ బిడ్‌ సమావేశానికి హాజరై మాట్లాడారు. నవంబర్‌ 14 నుంచి 18 వరకు వేలంపాట నిర్వహిస్తామని తెలిపారు. వేలం పాటలో పాల్గొనే వ్యక్తులు కలెక్టర్‌ కామారెడ్డి పేరున రూ.10 వేలు …

Read More »

గర్భిణీకి రక్తదానం

కామారెడ్డి, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న లక్ష్మి (25) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు ఐవీఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల అండ్‌ రెడ్‌ క్రాస్‌ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన రవికి తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా …

Read More »

ట్రస్టులు విజ్ఞాన కేంద్రాలుగా వ్యవహరించాలి

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సామాజిక, విద్య, వైద్య,విజ్ఞానాన్ని అందించే విధంగా ట్రస్టులు వ్యవహరించాలని రాష్ట్ర వ్యాప్త ట్రస్టుల, విజ్ఞాన కేంద్రల కోఆర్డినేటర్‌ ఎం. సోమయ్య పిలుపునిచ్చారు. మల్లు స్వరాజ్యం మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక డాక్టర్‌ రామ్‌ మోహన్‌ రావు అధ్యక్షతన గురువారం ట్రస్ట్‌ భవనములో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బాల,బాలికలకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే …

Read More »

జూనియర్‌ అసిస్టెంట్‌ సస్పెన్షన్‌

నిజామాబాద్‌, అక్టోబర్‌ 20 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో (న్యూ కలేక్టరేట్‌) గల వివిధ ప్రభుత్వ శాఖల కార్యాలయాలను కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఒక్కో శాఖ వారీగా అధికారులు, సిబ్బంది హాజరును పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా కొనసాగుతున్న సుధీర్‌ కుమార్‌ అనే ఉద్యోగి అనధికారికంగా విధులకు గైరుహాజరు కావడాన్ని …

Read More »
WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »