కామారెడ్డి, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలో గురువారం ప్రైవేటు వైద్యశాలలో అనీమియా వ్యాధితో బాధపడుతున్న లక్ష్మి (25) గర్భిణీ స్త్రీకి అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో వారి బంధువులు ఐవీఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల అండ్ రెడ్ క్రాస్ జిల్లా సమన్వయకర్త బాలును సంప్రదించారు. దోమకొండ మండల కేంద్రానికి చెందిన రవికి తెలియజేయడంతో వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లా కేంద్రంలోని కేబిఎస్ రక్తనిధి కేంద్రంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలు కాపాడారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ అన్ని దానాల కంటే రక్తదానం గొప్పదని రక్తదానానికి యువత ముందుకు రావాలన్నారు. ప్రతి మూడు నెలలకు ఒకసారి రక్తదానం, 15 రోజులకోసారి ప్లేట్ లెట్స్‌ను దానం చేసి ప్రాణాలను కాపాడవచ్చునన్నారు. రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాత రవికి కామారెడ్డి జిల్లా కలెక్టర్, రెడ్ క్రాస్ జిల్లా అధ్యక్షులు జతేష్ వి పాటిల్, తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కెబిఎస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది జీవన్ పాల్గొన్నారు.