నిజామాబాద్, అక్టోబర్ 20
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : సామాజిక, విద్య, వైద్య,విజ్ఞానాన్ని అందించే విధంగా ట్రస్టులు వ్యవహరించాలని రాష్ట్ర వ్యాప్త ట్రస్టుల, విజ్ఞాన కేంద్రల కోఆర్డినేటర్ ఎం. సోమయ్య పిలుపునిచ్చారు. మల్లు స్వరాజ్యం మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జన విజ్ఞాన వేదిక డాక్టర్ రామ్ మోహన్ రావు అధ్యక్షతన గురువారం ట్రస్ట్ భవనములో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
బాల,బాలికలకు శాస్త్రీయ విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా మల్లు స్వరాజ్యం ట్రస్టు వ్యవహరించాలని ఆ విధంగా కార్యక్రమాలను రూపొందించుకోవాలని ట్రస్ట్ సభ్యులకు సూచించారు. డాక్టర్ రామ్ మోహన్ రావు మాట్లాడుతూ నవంబర్లో బాలోత్సవ్ ను నిర్వహించాలని ప్రతిపాదించారు. డాక్టర్ రవీంద్రనాథ్ సూరి మాట్లాడుతూ మురికివాడలలో, పేద ప్రజలు నివసించే ప్రదేశాలలో వైద్యాన్ని అందించే ఏర్పాట్లు, కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు.
ప్రముఖ న్యాయవాది బాస రాజేశ్వర్ మాట్లాడుతూ సమాజంలో కుల, మత ప్రాతిపదికన విభజించే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని వాటిని నివారించే దిశగా ప్రజలను చైతన్యవంతం చేసే విధంగా సెమినార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కావ్యా ట్రస్ట్ వి.మధుసూదనరావు మాట్లాడుతూ విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో ట్రస్ట్ కార్యదర్శి కె రామ్మోహన్ రావు, వి.ప్రసాదరావు, సబ్బని లతా, ఈవిఎల్ నారాయణ, అద్దంకి కుషాన్, రమేష్ బాబు ,కళాకారుడు వేముల ఆనంద్ పాటలు అందరిని ఆకర్షించాయి. జెవివి అధ్యక్షులు నర్సింలు, నర్సింగరావు, తదితరులు పాల్గొన్నారు.