పాత కలెక్టరేట్‌లోకి ఆర్డీఓ కార్యాలయం

నిజామాబాద్‌, అక్టోబర్‌ 21

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ రెవెన్యూ డివిజనల్‌ అధికారి కార్యాలయం పాత కలెక్టరేట్‌ భవనంలోకి మారింది. పాత కలెక్టరేట్‌లో కొనసాగిన అన్ని శాఖలు ఇప్పటికే నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోకి చేరాయి. దీంతో ఖాళీగా ఉన్న పాత కలెక్టరేట్‌ లోకి ఆర్డీఓ ఆఫీసును మార్చారు.

కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి శుక్రవారం సాంప్రదాయబద్దంగా పూజలు నిర్వహించి కార్యాలయాన్ని లాంఛనంగా ప్రారంభించారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బి.చంద్రశేఖర్‌, ఆర్డీఓ రవి, డివిజన్‌ పరిధిలోని ఆయా మండలాల తహసీల్దార్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా జనరంజక పాలన

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : ప్రజల …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »