నిజామాబాద్, అక్టోబర్ 21
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నగరంలోని నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్ కళాశాలను ఆప్షన్ నుండి తొలగించాలని వివిధ విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. ఏఐఎస్‌ఎఫ్ ఎస్‌ఎఫ్‌ఐ, టీవీయువి, ఎఐఎస్‌బి, జివిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిబంధనలు పాటించని ఆయేషా బి.ఎడ్ కళాశాల ముందు ధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఏఐఎస్‌బి జిల్లా కార్యదర్శి మహెష్ రెడ్డి మాట్లాడుతూ ఆయేషా బి.ఎడ్ కళాశాల పేరు మీదుగా అఫిలియేషన్ తీసుకొని ఎన్‌సిటిఈ నిబంధనలు పాటించకుండా ఒకే కళాశాలలో డైట్‌ను నడపడం విడ్డూరమని అన్నారు. అదేవిధంగా ఆయేషా బి.ఎడ్ కళాశాలలో సరైన అటెండెన్స్ షీట్స్, అర్హతలకు అనుగుణంగా స్టాఫ్ లేకపోవడం దారుణమని ఆరోపించారు.
అదే విధంగా విద్యార్థుల నుండి డొనేషన్‌ల పేరిట అటెండెన్స్ పేరిట డెవలప్మెంట్ ఫీ పేరిట విద్యార్థులను నిలువు దోపిడి చేస్తున్న ఆయేషా బి.ఎడ్ కలశాలను వెబ్ ఆప్షన్స్ ప్రక్రియ తొలగించాలని డిమాండ్ చేశారు. సరైన వసతులు లేని కళాశాలకు యూనివర్శిటీ అధికారులు అఫిలియేషన్ ఇవ్వడం తగదని అన్నారు.
ఆయేషా బి.ఎడ్ కళాశాలపై రీ- విచారణ జరిపి గుర్తింపును రద్దు చేసేంత వరకు పోరాటాలు ఆపభోమని ఆయన హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి రఘురాం, యస్.యప్.ఐ జిల్లా కార్యదర్శి అనిల్, టీవీయువి రాష్ట్ర కోఆర్డినేటర్ లాల్ సింగ్, జీవీఎస్ జిల్లా అధ్యక్షులు జైత్రం, సుభోద్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.