నిజామాబాద్, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని మెడికోవర్ వైద్యశాలలో నరసయ్య (76) కు అత్యవసరంగా గుండె ఆపరేషన్ నిమిత్తమై బి పాజిటివ్ రక్తం అవసరం కావడంతో బిబీపేట మండల కేంద్రానికి చెందిన బచ్చు శ్రీధర్ కుమార్ వెంటనే స్పందించి సకాలంలో రక్తాన్ని అందజేసి ప్రాణాలను కాపాడారని రెడ్ క్రాస్ జిల్లా, ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
రక్తదానానికి ముందుకు వచ్చిన బచ్చు శ్రీధర్ కుమార్‌కు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు మాట్లాడుతూ కామారెడ్డి రక్తదాతల సమూహాన్ని 2007వ సంవత్సరంలో ఏర్పాటు చేయడం జరిగిందని నాటినుండి నేటి వరకు రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తాన్ని అందజేయడానికి నిరంతరం కృషి చేస్తున్నామని, ఇప్పటివరకు వేలాదిమందికి సకాలంలో రక్తాన్ని ప్లేట్‌లెట్స్ ను, కరోనా సమయంలో ప్లాస్మాను అందజేసి ప్రాణాలను కాపాడడం జరిగిందన్నారు.
రక్తదానానికి వేలాదిమంది యువకులు ముందుకు వస్తున్నారని నిస్వార్ధంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో మానవతా దృక్పథంతో సేవ చేయాలని ఉద్దేశంతోనే ఈ సమూహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎవరైనా రక్తదానం చేయాలనుకుంటే 9492874006 నెంబర్‌కు సంప్రదించాలన్నారు.