ధరణి సమస్యలు పరిష్కరించాలి

కామారెడ్డి, అక్టోబర్‌ 22

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి మండలంలో ధరణి ద్వారా ఇబ్బందులు పడుతున్న రైతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ కామారెడ్డి శాఖ ఆద్వర్యంలో ఎంఆర్‌వోకు వినతి పత్రం అందజేశారు.

ఈ సందర్భంగా మున్సిపల్‌ ఫ్లోర్‌ లీడర్‌ మోటూరు శ్రీకాంత్‌ మాట్లాడుతూ గత నెల బీజేపీ కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గ ఇంఛార్జి కాటిపల్లి వెంకట రమణ రెడ్డి ధరణి సమస్యల పరిష్కారం కోసం 10 రోజుల పాటు నిరసన, నిరాహార దీక్షలు చేపట్టారని, దీక్ష సమయంలో నియోజక వర్గంలోని రైతులు తాము ధరణి వల్ల ఎదుర్కొంటున్న సమస్యలను దీక్ష వద్దకు వచ్చి వివరించారన్నారు.

ఆయా రైతుల సమస్యలను అన్ని మండలాల వారీగా ఎంఆర్‌వోల దృష్టికి తీసుకెళ్ళి సమస్యలు పరిష్కరించాలని బీజేపీ తరుపున విన్నవించామని అన్నారు. ఎంఆర్‌వోలు తమ పరిధిలో గల రైతు సమస్యలను పరిష్కరించాలని అన్నారు. లేనియెడల రైతులతో రెవెన్యూ కార్యాలయాలను ముట్టడిరచాల్సి వస్తుందన్నారు. ధరణి వల్ల సమస్యను ఎదుర్కొంటున్న రైతుల వివరాలు, రైతు సమస్యతో కూడిన పత్రాలను వినతి పత్రంతో ఆటు జతచేశారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »