నిజామాబాద్, అక్టోబర్ 22
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కాలేజ్ ఫీజులను పెంచడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే ప్రమాదం ఏర్పడుతుందని, వెంటనే పెంచిన ఫీజులు తగ్గించాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు అంజలి డిమాండ్ చేశారు. శనివారం స్థానిక రైల్వే స్టేషన్ ఎదురుగా రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు అంజలి, రఘురాం మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 159 ఇంజనీరింగ్ కాలేజీల్లో రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచుకోవాలని జీవోని జారీ చేయడం సిగ్గుచేటని అన్నారు. టి ఏ ఎఫ్ ఆర్ సి సిఫారసులతో రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచడం సరికాదనిఆందోళన వ్యక్తం చేశారు. ఫీజు 45 వేల రూపాయలు పెంచడం ద్వారా 40 కాలేజీల్లో దాదాపు లక్ష రూపాయల ఫీజు దాటడం జరిగిందన్నారు. ఫీజుల పెంపుతో పేద మధ్య తరగతి విద్యార్థులు నాణ్యమైన విద్యను చదువుకోవడంలో ఇబ్బంది పడతారని అన్నారు.
అదేవిధంగా దేశవ్యాప్తంగా కరోనాతో ప్రజలు ఇబ్బంది పడుతూ ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ఫీజులు పెంచడం ద్వారా విద్యార్థులు, తల్లిదండ్రులు ఫీజులు కట్టలేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉందని విద్యార్థి సంఘ నాయకుల అన్నారు. వెంటనే పెంచిన ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు తగ్గించాలని, ఫీజులు పెంచే జీవోని రాష్ట్ర ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
పెంచిన ఇంజనీరింగ్ కాలేజీ ఫీజులు తగ్గించకపోతే రాబోయే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి కుశాల్ జిల్లా కమిటీ సభ్యులు సభోద్, వంశి, నాయకులు అఖిల, లావణ్య, పాల్గొన్నారు.