రక్తదానానికి ముందుకు రావడం అభినందనీయం

కామారెడ్డి, అక్టోబర్‌ 23

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా బిబీపెట్‌ మండల కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న యాద లక్ష్మి (34) కు అత్యవసరంగా ఆపరేషన్‌ నిమిత్తము ఏ పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యుడు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజు, ఎల్లారెడ్డికి చెందిన నాగరాజుకు తెలియజేశారు.

వెంటనే స్పందించి సకాలంలో వీటి ఠాకూర్‌ రక్తనిధి కేంద్రంలో రక్తం అందజేయడం జరిగిందని ఐవిఎఫ్‌ తెలంగాణ రక్తదాతల సమన్వయకర్త, రెడ్‌క్రాస్‌ జిల్లా సమన్వయకర్త డాక్టర్‌ బాలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్‌ బాలు మాట్లాడుతూ ఆపదలో ఉన్నవారికి సకాలంలో రక్తాన్ని, డెంగ్యూ వ్యాధితో బాధపడుతున్న వారికి ప్లేట్‌లెట్స్‌ను అందజేయడానికి సహకరిస్తున్నామని, జిల్లా వ్యాప్తంగా రోజురోజుకీ డెంగ్యూ కేసులు పెరగడం వల్ల చాలామంది ప్లేట్‌ లెట్స్‌ అవసరమని చాలామంది సంప్రదిస్తున్నారని సాధ్యమైనంత వరకు అందజేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, దాతలు మరింతగా ప్లేట్‌ లెట్స్‌ దానం చేయడానికి ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.

రక్తదానం చేసి ప్రాణాలు కాపాడిన రక్తదాత నాగరాజు, సహకరించిన రాజుకు తెలంగాణ టూరిజం కార్పొరేషన్‌ చైర్మన్‌, ఐవిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా,కామారెడ్డి జిల్లా కలెక్టర్‌ జితేష్‌ వి పాటిల్‌ తరఫున అభినందనలు తెలియజేశారు. రక్తదానం చేయాలనుకునేవారు 9492874006 నెంబర్‌కి సంప్రదించాలన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »