కామారెడ్డి, అక్టోబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, ఉచిత వైద్య పరీక్షలు, ఉచిత మందులు పంపిణీ చేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇంద్రనగర్ కాలనీ 20వ వార్డు వనిత విద్యాలయంలో మాతృశ్రీ హాస్పిటల్ ఆధ్వర్యంలో ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహించారు. షుగర్ ,బీపీ, థైరాయిడ్, పరీక్షలు చేసి అవసరమున్న వారికి ఉచితంగా మందులు అందజేశారు.
ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా న్యాయవాది మక్సుద్ ఆధ్వర్యంలో డాక్టర్ శ్రావణిక రెడ్డి సిబ్బందిని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా న్యాయవాది మక్సుద్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో ఆర్థికంగా బాధపడుతున్న చాలా కుటుంబాలలో ఆడపిల్ల పుట్టిందంటే భారంగా భావించే మీకు మేము అండగా ఉంటామని తన వంతు సహాయంగా తమ హాస్పిటల్ యందు ఒకవేళ మీకు ఆడపిల్ల పుట్టినట్లయితే డబ్బులు తీసుకోకుండా ఉచితంగా కాన్పు చేయడానికి ముందుకు రావడం డాక్టర్ శ్రావణిక రెడ్డి గొప్పతనమని అన్నారు.
ఆడవారి యొక్క బాధలంటే ఏంటో ఆమెకు తెలుసు కాబట్టి ఇలాంటి నిర్ణయం తీసుకున్నందుకు వారి అభినందిస్తున్నానని తెలిపారు. ఉచిత వైద్య శిబిరంలో 300 నుండి 400 వరకు వైద్య పరీక్షలు చేయించుకున్న వారికి తన వంతుగా నలుగురికి మగబిడ్డ పుడితే అయ్యే ఖర్చులు తానే భరించుకుంటానని తెలిపారు. వైద్య శిబిరంలో పాల్గొన్న వారందరికీ సౌత్ సెంట్రల్ రైల్వే రమేష్ పళ్ల రసాలు ఉచితంగా అందజేశారు, వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
డాక్టర్ శ్రావణిక రెడ్డి మాట్లాడారు. వైద్య శిబిరంలో గర్భిణీలు, మహిళలు, వృద్ధులు కూడా రావడం జరిగిందని, కొందరు గర్బిణీలకు థైరాయిడ్ ఉందని, బిపి షుగర్ పేషంట్స్ కూడా ఉన్నారని అన్నారు. కార్యక్రమంలో సౌత్ సెంట్రల్ రైల్వే రమేష్, గోపాలరావు, భోగి రవి, ఆంజనేయులు, భాస్కర్ రావు, అర్జున్, ఈశ్వర్, ఫిరోజ్ ఖాన్, మాతృశ్రీ హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.