ఎడపల్లి, అక్టోబర్ 23
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండలం కేంద్రానికి చెందిన ఓ యువకుడు అప్పుల బాధతో మనస్తాపం చెంది ఆదివారం ఉదయం ఇంటి బాత్రూంలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గ్రామానికి చెందిన షేక్ సద్దాం(25) అనే యువకుడు అప్పుల బాధతో ఆర్థిక ఇబ్బందులు తాళలేక మనస్తాపం చెంది ఇంట్లో ఎవరూ లేని సమయంలో బాత్రూంలో ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
గమనించిన కుటుంబీకులు హుటాహుటిన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. విషయం తెలుసుకున్న పోలీసులు శవ పంచనామా నిర్వహించారు. సంఘటనకు గల కారణాలను కుటుంబీకులను అడిగి తెలుసుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం శవాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. భార్య అయేషా పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ పాండేరావు తెలిపారు.