ఎడపల్లి, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఎడపల్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో దీపావళి పండగ పురస్కరించుకొని ఆడుతున్న పేకాట స్థావరాలపై దాడులు నిర్వహించి పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై పాండే రావు తెలిపారు. దీపావళి సందర్భంగా మండలంలో పేకాట జోరుగా సాగుతుందనే సమాచారం మేరకు సోమవారం మండలంలోని పలు గ్రామాలలో మూడు పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు చేశారు.
ఈ మేరకు పేకాట ఆడుతున్న 18 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి 18 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. 18 మంది పేకాటరాయుళ్ళ పై మూడు కేసులు నమోదు చేసి కోర్టుకు పంపనున్నట్లు ఎస్ఐ తెలిపారు.