నిజామాబాద్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మధ్యాహ్న భోజన పథక కార్మికుల సమస్యల పరిష్కారం కోసం ప్రగతిశీల మధ్యాహ్న భోజన పథక కార్మిక సంఘం (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో ఈనెల 28న జరిగే చలో హైదరాబాద్‌ను జయప్రదం చేయాలని ఐ.ఎఫ్.టి.యు జిల్లా ప్రధానకార్యదర్శి ఎం.సుధాకర్ అన్నారు. ఈ మేరకు శ్రామిక భవన్, కోటగల్లిలో విలేకరులతో మాట్లాడారు.
రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ స్కూల్లల్లో సుమారు 54వేల మందికి పైగా మధ్యాహ్న భోజన పథక కార్మికులు వండి, వడ్డిస్తున్నారన్నారు. వీరికి కేవలం నెలకు వెయ్యి రూపాయలు మాత్రమే గౌరవ వేతనం పేరుతో చెల్లిస్తున్నారన్నారు. మార్చ్ 2022 లో 3 వేలు చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. కానీ ఇప్పటికీ అమలు కావట్లేదన్నారు.
గౌరవ వేతనాన్ని 3 వేల రూపాయలకు పెంచి తక్షణమే అమలు చేయాలన్నారు. పెండిరగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని, మెనూ పెంచాలన్నారు. మార్కెట్ ధరలకు అనుకూలంగా గుడ్డు రేటు చెల్లించాలన్నారు. కార్మికులందరికీ సామాజిక భద్రత కల్పించాలన్నారు. వంట పాత్రలు, ఇతర సామాగ్రి సప్లై చేయాలన్నారు.
డిమాండ్ల సాధన కోసం ఈనెల 28న ప్రగతిశీల మధ్యాహ్న భోజన కార్మిక సంఘం (ఐ.ఎఫ్.టి.యు) ఆధ్వర్యంలో హైదరబాద్ ఇందిరా పార్క్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని జిల్లాలోని మధ్యాహ్న భోజన పథక కార్మికులకు పిలుపునిచ్చారు. విలేకరుల సమావేశంలో ఐ.ఎఫ్.టి.యు జిల్లా నాయకులు విటల్, నగర నాయకులు సంతోష్ పాల్గొన్నారు.