నిజాంసాగర్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం హాసన్పల్లి గ్రామ గేటు వద్ద వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని గున్కుల్ సొసైటీ చైర్మన్ వాజిద్ అలీ, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సాదుల సత్యనారాయణ చేతుల మీదుగా తూకానికి కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతులు ఆరుగాలం కష్టించి పండిరచిన పంటను ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల వద్దకే తెచ్చి విక్రయించాలన్నారు. దళారులను నమ్మిమోసపోవద్దని సూచించారు. ప్రభుత్వం మద్దతు ధర కల్పిస్తుందన్నారు.
కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ గొట్టం నరసింహులు, సర్పంచ్ సంగమేశ్వర్ గౌడ్, హసన్ పల్లి గ్రామ అధ్యక్షులు మేకల ఉషయ్య, నాయకులు రామచందర్, ధ్యామగారి మొగులయ్య తదితరులు ఉన్నారు.