నిజామాబాద్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : పెండిరగ్‌లో ఉన్న 2 వేల 7 వందల కోట్ల బోధన, ఉపకార వేతన రుసుములను సత్వరమే విద్యార్థులకు విడుదల చేయాలని, ఇటీవల ఇంజనీరింగ్ ఫీజులను పెంచుతూ విడుదల చేసిన జీవో 37 ను ఉపసంహరించుకోవాలని ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రంజిత్, ఏఐఎస్‌ఎఫ్ జిల్లా నాయకులు నవీన్, వంశీ డిమాండ్ చేశారు. బుధవారం నిజామాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రదాన కార్యదర్శి రంజిత్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిగ్రీ, ఇంజనీరింగ్, పీజీ, ఇతర వృత్తి విద్యా కోర్సులకు సంబంధించిన విద్యార్థుల ఫీజు బకాయిలు బోధనా, ఉపకార వేతన చెల్లించడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. 2021-2022 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల బోధనా, ఉపకార వేతన 2,700 కోట్ల బకాయిలు పెండిరగ్ ఉన్నాయని అన్నారు.
బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థి, యువత ఉన్నత విద్యకు దూరం అయ్యే ప్రమాదమున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. అదే విధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ కళాశాలల ఫీజులను పెంచుతూ విడుదల చేసిన జీవో 37 ను ఉపసంహరించుకోవాలని రంజిత్ డిమాండ్ చేశారు.
విద్యార్థులకు ఉన్నత విద్య దూరం చేసే విధానాలను ఏఐవైఎఫ్ వ్యతిరేకిస్తున్నదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి బోధనా, ఉపకార వేతన బకాయిల నిధులను మంజూరు చేయాలని ఆయన మాండ్ చేశారు. లేనియెడల విద్యార్థి యువజన ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా తీవ్రతరం చేస్తామని రంజిత్ హెచ్చరించారు.