నిజాంసాగర్, అక్టోబర్ 26
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండలం మల్లుర్ సొసైటీ కేంద్రం వద్ద టిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, సొసైటీ చైర్మన్ కళ్యాణి విఠల్ రెడ్డి, పిట్లం వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గైని విఠల్, వైస్ ఎంపీపీ మనోహర్‌లు కలసి కొబ్బరికాయ కొట్టి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.
అనంతరం అచ్చంపేట్ సొసైటీ పరిధిలోని మాగి, గోర్గాల్, నర్సింగ్‌రావుపల్లి, మంగళూరు గ్రామాల్లో టీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి, సొసైటీ చైర్మన్ నరసింహారెడ్డి కలిసి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు.
అనంతరం వారు మాట్లాడుతూ రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలని రైతులకు సూచించారు.
కార్యక్రమంలో తహసీల్దార్ నారాయణ, మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు రమేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు ఖాసిం సాబ్, కమ్మరి కత్త అంజయ్య, సుబ్బూరి సాయిలు, అంబవ్వ, మాజీ డిసిసిబి డైరెక్టర్ మోహన్ రెడ్డి, నాయకులు శ్రీకాంత్ రెడ్డి, గైని రమేష్, యటకారి నారాయణ, పండరీ, సీఈవోలు సంగమేశ్వర్ గౌడ్, సాయిలు, ఏఈఓ రేణుక తదితరులు ఉన్నారు.