కామారెడ్డి, అక్టోబర్ 25
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి డివిజనల్ పరిధిలోని బిక్కనూర్, దేవున్పల్లి, ఎల్లారెడ్డి డివిజనల్ పరిధిలోని గాంధారి, ఎల్లారెడ్డి, బాన్సువాడ డివిజనల్ పరిధిలోని బిచ్కుంద, జుక్కల్, మద్నూర్, నిజాంసాగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో పేకాట ఆడుతున్న 106 మందిని పట్టుకొని 21 కేసులు నమోదు చేసి రూ. 1 లక్ష 10 వేల 270 నగదు స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పి శ్రీనివాస రెడ్డి వెల్లడిరచారు.
కామారెడ్డి జిల్లాలో ఎవరైనా ఇకపై ప్రభుత్వ నిషేధిత పేకాట ఆడిన లేదా నిషేధిత కార్యకలాపాలకు పాటుపడినట్లు తెలిసినా వారిపై ప్రత్యేక నిఘా పెట్టి పట్టుకొని కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.