డిచ్పల్లి, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో పని చేస్తున్న వివిధ పరిపాలన అధికారుల కాల పరిమితిని ఒక సంవత్సరం పాటు పొడిగిస్తున్నట్టు వైస్ చాన్సలర్ ఆచార్య రవీందర్ గుప్తా తెలిపారు.
ఆడిట్ సెల్ డైరెక్టర్ గా ఆచార్య విధ్యావర్డిని, పరీక్షల నియంత్రణ అధికారిని ఆచార్య అరుణ, అదనపు పరీక్షల నియంత్రణ అధికారిగా డా. సాయిలు, కాంపిటీటివ్ సెల్ డైరెక్టర్గా డా. జి. బాల శ్రీనివాస మూర్తి, కో ఆర్డినేటర్ లిజనింగ్ , యూనివర్సిటీ లైబ్రరీ ఇంఛార్జి గా డా. కే. లావణ్య, ఆడిట్ సెల్ జాయింట్ డైరెక్టర్గా డా. జి. బాల కిషన్, అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా వి. శ్రీనివాస్ల కాల పరిమితి పొడిగించారు.
ఈ సంద్భంగా అధికారులు వైస్ చాన్సలర్ ఆచార్య రవీందర్ గుప్తా, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ విద్యావర్దినిలకు ధన్యవాదాలు తెలిపారు.