నిజామాబాద్, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ఆయిల్ పామ్ సాగు చేపట్టదలచిన రైతులు క్రింద తెలిపిన డాక్యుమెంట్లుజిరాక్స్ కాపీలను ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యానశాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.
- ఆధార్ కార్డు జీరాక్స్
- బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్
- పట్టాదారు పాసు పుస్తకం జిరాక్స్ కాపీ
- 1-బి కాపీ జిరాక్స్
- పాస్ సైజు ఫోటో-2
ఆయిల్ పామ్ సాగుకు ఉద్యాన శాఖ అందించు రాయితిలు : - 193 రూపాయలు ఒక మొక్క ఖరీదు కానీ రైతు చెల్లించవలసినది 20 రూపాయలు మాత్రమే. మిగిలినది రాయితి, ఎకరానికి 57 మొక్కలు.
- 4 సంవత్సరాల వరకు తోట నిర్వహణ ఖర్చు ఇవ్వబడును.
- మొదటి సంవత్సరం : ఎకరాకు 2100 రూపాయలు మరియు అంతరపంటవేసిననానికి ఎకరానికి 2100 రూపాయలు మొత్తం ఎకరానికి 4200 రూపాయలు
- రెండవ సంవత్సరం పైన తెలిపినవిధంగా ఎకరానికి రూ. 4200
5.మూడవ సంవత్సరం : పైన తెలిపిన విధంగా ఎకరానికి రూ.4200 ఎకరానికి - నాల్గవ సంవత్సరం పైన తెలిపిన విధంగా రూ.4200 ఇవ్వబడును, రైతు ఎన్ని ఎకరాలు సాగు చేపట్టినా రాయితీ ఇవ్వబడును.
- డ్రిప్ సేద్యం ద్వారా నీరు అందించుటకు 80 శాతం నుండి 100 శాతం వరకు రైతు కేటగిరిననుసరించి రాయితీ యివ్వబడును.
తోట నాటిన 3 సంవత్సరాల తర్వాత దిగుబడి ప్రారంభమై 30 సంవత్సరాల వరకు కొనసాగును. 3 సంవత్సరాల వరకు అన్ని రకాల కూరగాయలు, పల్లి, పెసలు, మినుములు, పత్తి, మక్కలు అంతరపంటలుగా వేసుకోవచ్చు. ఒక ఎకరానికి 10 టన్నుల దిగుబడి వచ్చును. ఒక ఎకరం తోట నుండి 1.00 లక్ష నుండి 1.20 లక్షల నికర ఆదాయం పొందవచ్చును మరియు కోతుల బెడద లేని పంట.
దరఖాస్తు చేసుకున్న రైతులకు జనవరి నుండి మొక్కలు యివ్వబడును. ఆయిల్ పామ్ సాగుపై ఆసక్తి గల రైతులు దరఖాస్తు చేయుటకు తమయొక్క జిరాక్స్‌లను తీస్కొని సంబంధిత వ్యవసాయ విస్తరణ అధికారి లేదా ఉద్యాన అధికారిని సంప్రదించగలరు.