కామారెడ్డి, అక్టోబర్ 27
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : మునుగొడులో అధికార పార్టీ ఓటమి భయంతో నిన్న జరిగిన ఎమ్మెల్యేల డ్రామాతో భారతీయ జనతాపార్టీని బద్నాం చేసిన సందర్భంగా బీజేపీ కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని నిజాంసాగర్ చౌరస్తాలో కెసిఆర్ దిష్టి బొమ్మ దహనం చేశారు.
ఈ సందర్భంగా బీజేపీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మోటూరి శ్రీకాంత్ మాట్లాడుతూ మునుగోడులో జరుగుతున్న ఉప ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతో అధికార టిఆర్ఎస్ పార్టీ చిల్లర రాజకీయాలు చేస్తోందని అన్నారు. నిన్నటి ఎమ్మెల్యేల కొనుగోలు డ్రామా చూసిన తర్వాత తెలంగాణలోని ప్రతి ఒక్కరికీ టిఆర్ఎస్ అంటేనే విరక్తి వచ్చేసిందని అన్నారు.
అధికార పార్టీ సింహయాజి స్వామి ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గురువు, రోహిత్ రెడ్డి వ్యాపార భాగస్వామి నందు, ఫార్మ్ హౌస్ రోహిత్ రెడ్డిది, కొనేందుకు ప్రయత్నించింది వారే, అమ్ముడుపోయేందుకు ఒప్పుకుంది వారే, బయట పెట్టేంది వారే కాని బీజేపీపై ఆరోపణలు చేస్తున్నారని ఇదేమి విడ్డూరం అని అన్నారు. నిన్నటి తతంగాన్ని హై కోర్ట్ సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ జరిపించాలనీ డిమాండ్ చేశారు. చారణకి కూడా అమ్ముడుపోని వాళ్ళని 100 కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం బీజేపీకి లేదన్నారు.