నిజాంసాగర్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజాంసాగర్ మండల కేంద్రంలోని ఎన్ఆర్ఈజీఎస్ కార్యాలయంలో ఏపీఓ శ్రీనివాస్ ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఏపీఓ మాట్లాడుతూ ఉదయం ఫీల్డ్ అసిస్టెంట్లు ఫోటో ఆన్లైన్లో అప్డేట్ చేసిన తర్వాత మధ్యాహ్నం కూడా ఫోటో ఆన్లైన్లో అప్డేట్ అయితే హాజరు పడుతుందని, ఉదయం ఆన్లైన్లో ఫోటో రాకపోతే హాజరు పడదని ఫీల్డ్ అసిస్టెంట్లకు సూచించారు.
ఉపాధి హామి కూలీలు సమయపాలన పాటించాలన్నారు. కార్యక్రమంలో టెక్నికల్ అసిస్టెంట్ బాల్ సింగ్, ప్రభాకర్, చంద్రశేఖర్ తదితరులున్నారు.