నిజామాబాద్, అక్టోబర్ 28
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు పే రివిజన్ కమిటీ కాల పరిమితి ముగుస్తున్నందున తక్షణమే పీ.ఆర్.సి. కమిటీని నియమించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర డిప్యూటీ సెక్రటరీ జనరల్ పి.నారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మల్లు స్వరాజ్యం ట్రస్ట్ భవనంలో జరిగిన నిజామాబాద్ డివిజన్ మహాసభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
డివిజన్ అధ్యక్షులు సిర్ప హనుమాన్లు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెన్షనర్ల పట్ల నిర్లక్ష్య వైఖరిని అవలంబిస్తున్నాయని ఆయన ఆరోపించారు. జిల్లా అధ్యక్షులు శాస్త్రుల దత్తాద్రిరావు మాట్లాడుతూ పాత పిఆర్సిలో పొందుపరిచిన అంశాలు ఈరోజు వరకు జీవోలు జారీ కాలేదని అన్నారు. ఉపాధ్యక్షులు ముత్తారం నరసింహస్వామి మాట్లాడుతూ పెన్షన్లకు రావాల్సిన బకాయిలు ప్రభుత్వం చెల్లించటం లేదని నెలలు, సంవత్సరాల తరబడి బడ్జెట్ లేని కారణంగా చెల్లింపులు జరగటం లేదని తెలిపారు.
సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కే రామ్మోహన్రావు, ప్రసాద్ రావు, పోలీసు రిటైర్డ్ ఉద్యోగుల నాయకులు సుదర్శన్ రావు, ఈవిఎల్ నారాయణ తదితరులు పాల్గొన్నారు.