రైతు సంక్షేమం కొరకే కొనుగోలు కేంద్రాలు

కామరెడ్డి, అక్టోబర్‌ 28

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కొరకె ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభిస్తుందని పోల్కంపేట్‌ సర్పంచ్‌ పద్మ నాగరాజు అన్నారు. శుక్రవారం షేట్పల్లి సంగారెడ్డి ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో పోల్కంపేట్‌లో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు,

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు సంక్షేమం కొరకు తెలంగాణ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిందని అన్నారు. ఆరుగాలం కష్టించి పంటలు పండిరచిన రైతన్నకు, మంచి గిట్టుబాటు ధర అందించేందుకు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిందని అన్నారు. ప్రభుత్వం ఏ గ్రేడ్‌ ధాన్యానికి రూ. 2060, బి గ్రేడ్‌ ధాన్యానికి రూ. 2040 మద్దతు ధర అందిస్తుందని తెలిపారు.

రైతులు అమ్మిన ధాన్యానికి సంబంధించిన అన్ని ధ్రువపత్రాలు సకాలంలో అందిస్తే వారం రోజుల్లోనే నేరుగా రైతుల ఖాతాల్లో ధాన్యానికి సంబంధించిన డబ్బులను జమ చేయడం జరుగుతుందన్నారు. రైతులందరూ తమ ధాన్యాన్ని దళారులకు అమ్మకుండా నేరుగా కొనుగోలు కేంద్రంలోకి తీసుకువచ్చి ధాన్యాన్ని విక్రయించాలన్నారు. సంబంధిత కొనుగోలు కేంద్రం నిర్వాహకులు తేమ శాతం పరిశీలించి తూకం వేయడం జరుగుతుందన్నారు.

కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ ఛత్రం రామానుజ చారి, వైస్‌ చైర్మన్‌ బండారు కిష్టారెడ్డి గారి సంజీవ రెడ్డి, సొసైటీ సీఈఓ శ్రీనివాస్‌, డైరెక్టర్లు కవిత, ఆగమయ్యా, సత్యనారాయణ, రామదాసు, రాములు, విడిసి అధ్యక్షుడు సిద్దిరాములు, ఎఇఓ రమ్య, వార్డు మెంబర్‌ సాయిలు, రైతులు బాగయ్య, శ్రీనివాస్‌, మల్లయ్య, నరేష్‌, సిబ్బంది ప్రసాద్‌, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Check Also

నేటి పంచాంగం

Print 🖨 PDF 📄 eBook 📱 శుక్రవారం, ఏప్రిల్‌ 4, 2025శ్రీ విశ్వావసు నామ సంవత్సరంఉత్తరాయనం – వసంత …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »