కామారెడ్డి, అక్టోబర్ 29
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా సరంపల్లి గ్రామంలో గల విద్యానికేతన్ పాఠశాల చెందిన బస్సులను పట్టణంలోని అశోక్ నగర్ కాలనీ ఇతర ప్రాంతాల్లో మితిమీరిన వేగంతో నడపడం జరుగుతుందని కనీస అవగాహన లేని వ్యక్తులను బస్సు డ్రైవర్లుగా నియమించుకోవడం వల్లనే ఇష్టానుసారంగా బస్సులను నడిపించడం జరుగుతుందని కామారెడ్డి జిల్లా రవాణా అధికారులు వెంటనే స్పందించి ఈ పాఠశాలకు చెందిన బస్సులను అనుమతులను రద్దు చేయాలని వాటిని సీజ్ చేయాలని టిఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ బాలు డిమాండ్ చేశారు.