డిచ్‌పల్లి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : తెలంగాణ విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య డి. రవీందర్ ఆదివారం ఉదయం హైదరాబాద్‌లో నార్త్ అమెరికా పద్మశాలి అసోసియేషన్ అధ్యక్షులు కర్నాటి ఆంజనేయులును మర్యాద పూర్వకంగా కలిసి శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరల్డ్ వీవర్స్ ఆర్గనైజేషన్స్ చైర్మన్ (డబ్ల్యూడబ్ల్యూఒ) గా ఉన్న కర్నాటి ఆంజనేయులు ఆధ్వర్యంలో శనివారం నారాయణ గూడలోని పద్మశాలి భవనంలో జరిగిన చేనేత కార్యక్రమంలో ఆసు యంత్రాలను పంపిణీ చేయడం పట్ల హర్షం ప్రకటిస్తూ ప్రత్యేకంగా ప్రశంసించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, చేనేత లబ్దిదారుల సహకారంతో ఆసు యంత్రాల పంపిణీని ఆయన కొనసాగిస్తున్నారని అన్నారు.
పద్మశ్రీ చింతకింది మల్లేశం సృష్టించిన ఆసు యంత్రం చేనేత కార్మికుల కష్టాలను తీరుస్తుందని చెబుతూ, అలాంటి ఆసు యంత్రాల పంపిణీలో కర్నాటి ఆంజనేయులు 100 మందికి లబ్ది చేకూర్చారని అన్నారు. అంతేగాక అమెరికాలో నాపా అధ్యక్షులుగా తెలుగు వారి సంస్కృతి సంప్రదాయాలను పెంపొందింపజేస్తూ అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని అన్నారు.
అమెరికాలో ప్రవాస పద్మశాలి కులబాంధవుల సంక్షేమం కోసం ఎల్లవేళలా కృషి చేస్తుంటారని అన్నారు. అమెరికాకు తాను ఎప్పుడు వెళ్లిన ఎంతో అప్యాయంగా ఆహ్వానించి, గౌరవంగా చూసుకుంటారని అన్నారు. కర్నాటి ఆంజనేయులు స్నేహశీలతను, సౌజన్య మూర్తిమత్వాన్ని కొనియాడారు. తెలంగాణ విశ్వవిద్యాలయ సందర్శనకు రావలసిందిగా ఆహ్వానించినట్లు తెలిపారు.
ఈ సందర్భంగా కర్నాటి ఆంజనేయులు మాట్లాడుతూ అత్యుత్తమ స్టాన్ ఫర్డ్ యూనివర్సిటీ సర్వేలో వరుసగా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన రెండవ శాతం శాస్త్రవేత్తలలో ర్యాంకింగ్ సాధించిన సందర్భంగా ఉపకులపతి ఆచార్య డి. రవీందర్‌కు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. శాస్త్ర సాంకేతిక రంగాలలో ముఖ్యంగా నానో టెక్నాలజీలో విశేషకృషి చేస్తూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడిరపజేస్తున్న వీసీ ప్రశంసించారు.