కామారెడ్డి, అక్టోబర్ 30
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలకు అండగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులే ప్రభుత్వ నిబంధనలను తుంగలో తొక్కున్నారు… ఇలాంటి సంఘటన కామారెడ్డి మండలం ఉగ్రవాయిలో చోటు చేసుకుంది. గత 10 సంవత్సరాల క్రితం గ్రామస్తులందరూ ఏకమై శివాలయం కోసం భూమిని కేదార్నాథ్ అనే పీఠాధిపతిపై గ్రామస్తులు అందరు కలిసి సర్వే నెంబర్ 155/9 లో ఒక ఎకరం 13 గుంటల భూమిని సర్వే నెంబర్ 147 లో 22 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని గ్రామస్తులు తెలిపారు.
ప్రస్తుతం ఈ భూమిని గ్రామ సర్పంచ్ సునీత భర్త జనార్దన్ రెడ్డి, పబ్బ జగన్నాథం, విఆర్‌ఓ సుధాకర్ రావు కలిసి శివాలయం కొరకు తీసుకున్నటువంటి భూమిని రియల్ ఎస్టేట్తో కుమ్మక్కై భూమిని ప్లాట్లు చేసి అమ్మే ప్రయత్నం చేస్తున్నారని అలా ఎందుకు చేస్తున్నారని అడిగినందుకు ఉగ్రవాయి గ్రామానికి చెందిన తాళ్ల మల్లారెడ్డి, జూకంటి వెంకటరెడ్డి, ములుక వీరేశం, పొలావేని మల్లేష్‌పైన దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
అడిగిన వారి పైన కేసులు పెట్టి భయాందోళనకు గురి చేస్తున్నారని గ్రామానికి చెందిన మాస శ్రీనివాస్, పోలబోయిన మల్లేష్, కొయ్యడ లక్ష్మిపతి అన్నారు. ఎవరైతే పిటిషన్ ఇచ్చారో వారు పోలీస్ స్టేషన్ రావాలని డిమాండ్ చేస్తూ దేవునిపల్లి పోలీస్ స్టేషన్‌కు ఉగ్రవాయి గ్రామస్తులందరు కలిసి సోమవారం వెళ్ళారు.