సమాచార శాఖ (ఏ.ఆర్‌.ఈ) ఏఈఐఈకి ఘనంగా వీడ్కోలు

నిజామాబాద్‌, అక్టోబర్‌ 31

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : నిజామాబాద్‌ జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ (ఏ.ఆర్‌.ఈ) విభాగంలో సహాయ ఎగ్జిక్యూటివ్‌ సమాచార ఇంజనీర్‌ (ఏఈఐఈ)గా విధులు నిర్వర్తించి సోమవారం పదవీ విరమణ చేసిన వీ.కరుణశ్రీనివాస్‌ కుమార్‌కు ఆ శాఖ సిబ్బంది ఘనంగా వీడ్కోలు పలికారు. దాదాపు ముప్పై సంవత్సరాల పాటు విధులు నిర్వర్తించిన కుమార్‌, ఏడాదిన్నర కాలం పాటు ఇంకనూ తన సర్వీసు మిగిలి ఉన్నప్పటికీ వ్యక్తిగత కారణాలతో స్వచ్చంద పదవీ విరమణ తీసుకున్నారు.

ఈ సందర్భంగా ఏ.ఆర్‌.ఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వీడ్కోలు కార్యక్రమంలో వీ.కరుణశ్రీనివాస్‌ కుమార్‌ ను పూలమాలలు శాలువాలతో సత్కరించి, జ్ఞాపికను బహూకరించారు.

సమాచార శాఖలో ఆయన అందించిన సేవలను సహచర అధికారులు, సిబ్బంది కొనియాడుతూ, శేష జీవితం ఆయురారోగ్యాలతో సంతోషంగా గడపాలని ఆకాంక్షించారు. తన ఉద్యోగ నిర్వహణలో సహకరించిన ప్రతి ఒక్కరికి కరుణశ్రీనివాస్‌ కుమార్‌ కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ సమాచార ఇంజనీర్‌ వేణి ప్రసన్న, సీనియర్‌ పర్యవేక్షకులు రవూఫ్‌, మాజిద్‌, రికార్డు అసిస్టెంట్‌ సునీల్‌, సిబ్బంది పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »