కామారెడ్డి, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో రక్తహీనతతో బాధపడుతున్న టేక్రియాల్ గ్రామానికి చెందిన నారాయణరావుకు అత్యవసరంగా ఏ పాజిటివ్ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి రక్తదాతల సమూహ క్రియాశీలక సభ్యుడు పెద్ద మల్లారెడ్డి గ్రామానికి చెందిన పెంజర్ల సురేష్ రెడ్డి వెంటనే స్పందించి పట్టణంలోని మెడికల్ ఏజెన్సీలో విధులు నిర్వహిస్తున్న లింగాపూర్ గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి సహకారంతో ఏ పాజిటివ్ రక్తదానాన్ని కేబిఎస్ బ్లడ్ బ్యాంకులో అందజేసినట్టు రెడ్ క్రాస్ జిల్లా ఐ.వి.ఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు తెలిపారు.
అత్యవసర పరిస్థితుల్లో ఉన్న వ్యక్తికి రక్తదానం చేసిన రక్తదాతకు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కెబిఎస్ బ్లడ్ బ్యాంక్ సిబ్బంది జీవన్, సంతోష్ పాల్గొన్నారు.