కామారెడ్డి, అక్టోబర్ 31
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి కలెక్టరేట్లో సోమవారం సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యత ప్రతిజ్ఞను చేపట్టారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఆధ్వర్యంలో జిల్లా అధికారులు ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చంద్రమోహన్ ప్రతిజ్ఞ చదివి వినిపించారు.
జిల్లా ఉద్యోగులు ముందుకు చేతులు చాచి ప్రతిజ్ఞ చేశారు. దేశ ఐక్యమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితం అవుతానని, ఈ సందేశాన్ని తోటి వారందరితో విస్తరింప చేయడానికి గట్టిగా కృషి చేస్తానని సత్య నిష్టతో ప్రతిజ్ఞ చేస్తున్నాను. సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క దార్శనికత, చర్యల వల్ల లభ్యమైన నా దేశ ఏకీకరణ స్ఫూర్తితో నేను ఈ ప్రతిజ్ఞను చేస్తున్నాను. నా దేశ అంతర్గత భద్రతను పటిష్ట పరచడానికి స్వయ తోడ్పాటునందిస్తానని ప్రమాణం చేస్తున్నాను. ప్రతిజ్ఞ చేసిన వారిలో డిఆర్డిఓ సాయన్న, ఏవో రవీందర్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.