కామారెడ్డి, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని శ్రీ కల్కి ఆలయంలో గత మూడు సంవత్సరాలుగా ప్రతి మంగళవారం నిర్వహిస్తున్న అన్నదాన కార్యక్రమాన్ని నేడు కూడా కొనసాగించారు. ఈ సందర్భంగా ఆలయ సేవకులు ఏర్రం విజయ్, సిద్ధంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ శ్రీ అమ్మ భగవానుల సూచనల మేరకు 2020 సంవత్సరంలో అన్నదాన కార్యక్రమాన్ని ఆలయంలో ప్రారంభించడం జరిగిందని నిర్విరామంగా గత మూడు సంవత్సరాల నుండి అన్నదాన కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నామన్నారు.
ఆకలితో ఉన్నవారికి పట్టెడన్నం పెట్టాలని అమ్మ భగవానుల మహోన్నతమైన సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంతగా నిర్వహించడం జరుగుతుందని, పుట్టినరోజు సందర్భంగా,పెళ్లిరోజు సందర్భంగా, తల్లిదండ్రుల జ్ఞాపకార్థం అన్నదానం చేయాలనుకునేవారు వారి వివరాలను ఆలయానికి వచ్చి తెలియజేయగలరని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సేవకులు ఎర్రం చంద్రశేఖర్, డాక్టర్ బాలు,దిగంబర్, శ్రావణి, నాగరాజు, లక్ష్మణ్, వినోద్, శ్రీకాంత్, నాగ సాయి, స్వరూప, సంతోష్ పాల్గొన్నారు.