కామారెడ్డి, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఉగ్రవాయి గ్రామంలో సాయిబాబా ఆలయం వద్ద పి.ఎం.పి వైద్యుల అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ కామారెడ్డి ఆధ్వర్యంలో పి.ఎం.పి వైద్యుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి ముఖ్యఅతిథిగా పిఎంపి వైద్యుల రాష్ట్ర నాయకులు పుల్గం మోహన్, రవి వర్మ విచ్చేశారు.
అనంతరం ధన్వంతరి పూజా మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు పుల్గం మోహన్, రవి వర్మ, జిల్లా నాయకులు బాలకిషన్ గౌడ్, శ్రీనివాస్, విట్టల్ మాట్లాడుతూ పిఎంపి వైద్యులు గ్రామాలల్లో, మండలాల్లో వైద్య సేవలో ముందుంటూ కరోనా మహమ్మారి సమయంలో కూడా వైద్య సేవలు అందించడం జరిగిందన్నారు.
సమాజంలో పీఎంపీ వైద్యులపై దాడులు జరుగుతున్నాయని అలాంటి దాడులు జరగకుండా తమ పిఎంపి వైద్యులను గుర్తించి తెలంగాణ ప్రభుత్వము గుర్తింపును అందించాలన్నారు. పిఎంపి వైద్యులు కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ సకాలంలో వైద్యం అందించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు బాలకిషన్, డివిజన్ అధ్యక్షులు విట్టల్, శ్రీనివాస్ చారి, చందు, హోమ్ ప్రకాష్, సత్యనారాయణ గౌడ్, గోపు శ్రీనివాస్, భాస్కర్ వివిధ గ్రామాల వైద్యులు పాల్గొన్నారు.