కామారెడ్డి, నవంబర్ 1
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని షెడ్యూల్ కులాల బాలుర వసతి గృహాన్ని మంగళవారం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ పరిశీలించారు. వసతి గృహం లో ఉన్న గదులను, మరుగుదొడ్లను చూశారు. వసతి గృహం పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు.
అనంతరం జిల్లా కేంద్రంలోని సమీకృత బాలికల సంక్షేమ వసతిగృహ సముదాయాన్ని తనిఖీ చేశారు. వంటశాలను, భోజనశాలను పరిశీలించారు. కంప్యూటర్ ల్యాబ్ గదిని పరిశీలించారు. ఆట వస్తువుల గదిని చూశారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా షెడ్యూల్ కులాల సంక్షేమ అధికారిని రజిత, వసతి గృహాల సంక్షేమ అధికారులు నాగరాజు, సరిత, అధికారులు పాల్గొన్నారు.