కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా ఉప్పల్ వాయీ గ్రామానికి చెందిన నిఖిల్‌కు గుండె ఆపరేషన్ నిమిత్తమై హైదరాబాదులోని నిమ్స్ వైద్యశాలలో ఓ నెగటివ్ రక్తం అవసరం అని తెలియజేయగాననే వెంటనే స్పందించి కామారెడ్డి రక్తదాతల సమూహ ఉపాధ్యక్షుడు పడిహర్ కిరణ్ కుమార్ 49 వ సారి, గాంధారికి చెందిన దాసి శ్రీకాంత్ 11వ సారి రక్తదానం చేశారని రెడ్ క్రాస్, ఐవిఎఫ్ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్ వేదప్రకాష్ తెలిపారు.
ఈ సందర్భంగా డాక్టర్ బాలు, డాక్టర్ వేదప్రకాష్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లా కేంద్రం నుండి హైదరాబాద్ వెళ్లి రక్తదానం చేయడం అభినందనీయమని, నేటి సమాజంలో కుటుంబ సభ్యులే రక్తదానం చేయడానికి ముందుకురాని పరిస్థితుల్లో కిరణ్, శ్రీకాంత్ హైదరాబాద్ వెళ్లి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడడం అభినందనీయమన్నారు. వీరికి తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, రెడ్ క్రాస్ కామారెడ్డి జిల్లా అధ్యక్షులు మరియు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తరఫున అభినందనలు తెలిపారు. వీరిని స్ఫూర్తిగా తీసుకొని యువకులు అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు.