రెంజల్, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : రైతులు పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రాలను ప్రతి ఒక్క రైతు సద్వినియోగం చేసుకోవాలని ఎంపీపీ రజినీ కిషోర్ అన్నారు. బుధవారం మండలంలోని బాగేపల్లి, దండిగుట్ట, అంబేద్కర్ నగర్, నీలా, బొర్గం గ్రామాల్లో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను జడ్పీటీసీ మేక విజయ సంతోష్‌తో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరుకాలను సమితి పండిరచిన ధాన్యాన్ని దళారుల పాలు చేయకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యాన్ని విక్రయించి రైతులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ప్రభుత్వం గిట్టుబాటు ధర ‘‘ఏ’’ గ్రేడ్ ధాన్యానికి రూ.2060 రూపాయలు, ’’బి’’గ్రేడ్ ధాన్యానికి రూ.2040 రూపాయలను అందిస్తుందని ఈ అవకాశాన్ని ప్రతి రైతు సద్వినియోగం చేసుకొని ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించి లాభాలను ఆర్జించాలని అన్నారు.
కార్యక్రమంలో ఎంపీడీవో శంకర్, ఎంపీఓ గౌసోద్దీన్, వైస్ ఎంపీపీ యోగేష్, సర్పంచ్‌లు సాయిలు, శ్రీదేవి, మధురబాయి, లలిత, వాణి, మహిళా సమాఖ్య మండల అధ్యక్షురాలు లక్ష్మీ, ఏపీఎం చిన్నయ్య, సీసీలు శ్యామల, రాజయ్య, శివ, కృష్ణ తదితరులు ఉన్నారు.