కామారెడ్డి, నవంబర్ 2
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : జిల్లా కేంద్రంలోని సమీకృత బాలికల సంక్షేమ వసతి గృహ సముదాయాన్ని బుధవారం రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణి సందర్శించారు. విద్యార్థినుల సామర్థ్యాలను అడిగి తెలుసుకున్నారు. వసతి గృహం పరిసరాలను పరిశీలించారు. భోజనశాలను చూశారు. పరిసరాల్లో ఉన్న మొక్కలను పరిశీలించారు. వసతి గృహం ఆవరణలో ఆహ్లాదకరమైన వాతావరణం ఉందని సంతృప్తిని వ్యక్తం చేశారు.
రామారెడ్డి మండలం ఉప్పల్‌వాయి బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. అంతకు ముందు ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద రాష్ట్ర షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ కమిషనర్ యోగితా రాణాకు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ వెంకటేష్ దోత్రే, జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ సంక్షేమ అధికారిని రజిత, ఆర్డీవో శీను మొక్కలను అందజేసి స్వాగతం పలికారు.