ఆపరేషన్‌ నిమిత్తం రక్తదానం

కామారెడ్డి, నవంబర్‌ 4

నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ప్రైవేటు వైద్యశాలలో కొండాపూర్‌ గ్రామానికి చెందిన సోనా అనే మహిళకు ఆపరేషన్‌ నిమిత్తమై బి పాజిటివ్‌ రక్తం అవసరం కావడంతో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మైత్రి మల్టీ స్పెషాలిటీ వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న రాజేష్‌ మానవ దృక్పథంతో ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణాలను కాపాడారని రెడ్‌ క్రాస్‌ జిల్లా, ఐవిఎఫ్‌ తెలంగాణ రాష్ట్ర రక్తదాతల సమన్వయకర్త డాక్టర్‌ బాలు, కామారెడ్డి రక్తదాతల సమూహ అధ్యక్షుడు డాక్టర్‌ వేద ప్రకాష్‌ తెలిపారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18 సంవత్సరాల వయసు నుండి 60 సంవత్సరాల వయసు కలిగిన యువత ప్రతి 3 నెలలకోసారి రక్తదానం 15 రోజులకు ఒకసారి ప్లేట్‌లెట్స్‌ దానం చేయవచ్చునని, రక్తదానం చేసేవారికి గుండె జబ్బు, శరీరంలో కొలెస్ట్రాల్‌ పెరుగుదల వంటి సమస్యలను రాకుండా ఉండే అవకాశం ఉందని అన్నారు.

రక్తదానానికి ముందుకు వచ్చిన రక్తదాతకు తెలంగాణ రాష్ట్ర టూరిజం కార్పొరేషన్‌ డెవలప్మెంట్‌ చైర్మన్‌ ఉప్పల శ్రీనివాస్‌ గుప్తా, కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, రెడ్‌ క్రాస్‌ అధ్యక్షులు జితేష్‌ వి పాటిల్‌ తరఫున అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో కామారెడ్డి రక్తదాతల సమూహ సభ్యులు జాదవ్‌ కృష్ణ, వీ.టి ఠాకూర్‌ బ్లడ్‌ బ్యాంక్‌ టెక్నీషియన్లు చందన్‌, ఏసు గౌడు పాల్గొన్నారు.

Check Also

దివ్యాంగులకు క్రీడా పోటీలు

Print 🖨 PDF 📄 eBook 📱 నిజామాబాద్‌, నవంబర్‌ 21 నిజామాబాద్‌ న్యూస్‌ డాట్‌ ఇన్‌ : జిల్లా …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

WP2Social Auto Publish Powered By : XYZScripts.com
Translate »