బోధన్, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలోని పోతంగల్ పాఠశాలలో స్థానిక సర్పంచ్ వర్ని శంకర్ మధ్యాహ్న భోజనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు నాణ్యమైన భోజనం పెడుతున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు.
మెనూ ప్రకారం ప్రతి విద్యార్థికి భోజనం వడ్డించాలని ప్రధానోపాధ్యాయులకు సూచించారు. విద్యార్థులు అన్నం తినేముందు చేతులు శుభ్రంగా కడుక్కోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ వర్ని శంకర్, మాజీ సర్పంచ్ గంట్ల విట్టల్, ప్రధానోపాధ్యాయులు, మధ్యాహ్న భోజన నిర్వాకులు, విద్యార్థులు పాల్గొన్నారు.