బోధన్, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండల కేంద్రంలో 180 రెండు పడకల గదుల ఇండ్ల నిర్మాణం పనులను డిఈ నాగేశ్వరరావు పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం రెండు పడకల గదుల నిర్మాణ లబ్ధిదారుల ఇండ్లను స్థానిక సర్పంచ్‌తో పాటు సర్వే చేయడం జరిగింది.
ఇండ్లు ఏ దశలో ఉన్నాయని డిఈ నాగేశ్వరరావు లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. ఇండ్లు నిర్మాణమును బట్టి బిల్లులు మంజూరు చేయబడుతుందని లబ్ధిదారులకు తెలిపారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ పత్తి లక్ష్మణ్, మాజీ ఎంపిటిసి సలీం, మాజీ ఉపసర్పంచ్ కలీం, మైనార్టీ నాయకులు హర్షద్, వార్డ్ మెంబర్ జలాల్ ఇస్మాయిల్, అమన్, యూత్ సభ్యులు జమీర్, వాజిద్, ముష్రాఫ్, తదితరులు పాల్గొన్నారు.