వర్ని, నవంబర్ 4
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో సిఐటియు ఆధ్వర్యంలో మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యల పరిష్కారం కోరుతూ వర్ని తహసిల్దార్ కార్యాలయాన్ని ముట్టడిరచారు. 9,10 తరగతులకు సంబంధించిన 6 నెలల బకాయి బిల్లులు చెల్లించాలని, నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించక పోవడం బాధాకరమన్నారు.
మధ్యాహ్న భోజన ఏజెన్సీ నిర్వాహకులు మధ్యాహ్న భోజన యూనియన్ గౌరవ ఆధ్యక్షులు నన్నేసాబ్ మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన కార్మికుల సమస్యలపై పలుమార్లు అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోవడంతో తహసీల్దార్ కార్యాలయాన్ని ముట్టడిరచామన్నారు. 6 నెలల బకాయి బిల్లులు చెల్లించకపోతే ప్రభుత్వ పాఠశాలలో భోజనం ఎలా పెట్టాలని ప్రశ్నించారు.
ప్రతినెల తహసీల్దార్, ఎంపీడీఓ, ఎంఈఓ, ప్రధానోపాధ్యాయులు, ఏజెన్సీ నిర్వాహకులతో సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వెంటనే బకాయి బిల్లులు చెల్లించాలని, ప్రభుత్వం పెంచిన 3వేల వేతనం అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో ఏజెన్సీ నిర్వాహకులు ఆలియా, సాయిబాబు, గంగాధర్, తేజ, సాయిలు, గంగారం తదితరులు పాల్గొన్నారు.
తహసిల్దార్ వివరణ
ఇంచార్జ్ తహసిల్దార్ విజయలక్ష్మి మాట్లాడుతూ మధ్యాహ్న భోజన బిల్లులపై ఉన్నతాధికారుల దృష్టికి సమాచారం అందిస్తామని అన్నారు. ప్రతి నెల మొదటి వారంలో ఎమ్మార్వో, ఎంపీడీవో, స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులతో ఏజెన్సీ కార్మికులతో సమావేశం నిర్వహించి బిల్లులపై కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తామని వివరణ ఇచ్చారు.