కామారెడ్డి, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అయ్యప్ప దేవాలయానికి శనివారం ఐవిఎఫ్ జిల్లా అధ్యక్షుడు విశ్వనాధుల మహేష్ గుప్తా అనిత పెళ్లి రోజు సందర్భంగా 20 వేల రూపాయల విలువైన స్టీలు వాటర్ ట్యాంక్‌ను అందజేశారు. వాటర్ ట్యాంకును అందజేసినందుకుగాను ఆలయ కమిటీ ప్రతినిధులు విశ్వనాథుల మహేష్ గుప్తా అనిత దంపతులను అభినందించారు.
ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలను మరింతగా చేయాలని ఆలయ కమిటీ సభ్యులు ఆకాంక్షించారు. కార్యక్రమంలో అయ్యప్ప అన్నదాన ట్రస్ట్ శాశ్వత అధ్యక్షులు చీల ప్రభాకర్, (పేపర్) కూర గుప్త పంపరి లక్ష్మణ్, సోమిశెట్టి నారాయణ గుప్తా, అయ్యప్ప ఆలయ దేవస్థానం మేనేజర్ ప్రేమ్ గుప్తా సభ్యులు పాల్గొన్నారు.