ఎడపల్లి, నవంబర్ 5
నిజామాబాద్ న్యూస్ డాట్ ఇన్ : ప్రజలు యోగ పద్ధతులు అవలంభిస్తే మానసిక ప్రశాంతతతో పాటు శారీరక దృఢత్వం ఏర్పడుతుందని ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ అన్నారు. ఈ మేరకు ఎడపల్లి మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో యోగా భవన నిర్మాణానికి ఎంపీపీ శ్రీనివాస్, జడ్పీ వైస్ చైర్మన్ రజిత యాదవ్ శనివారం భూమి పూజ చేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎడపల్లి మండల కేంద్ర ప్రజలు యోగా చేసుకునేందుకు నూతన భవనం నిర్మిస్తున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆయుష్ పథకంలో బాగంగా రూ. 6 లక్షల నిధులతో యోగా కేంద్రాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు.
యోగా వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని, ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని తెలిపారు. కేంద్రంలో ప్రజలు యోగా చేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపిపి ఇమ్రాన్ ఖాన్, ఆయుష్ వైద్యులు డా.వెంకటేష్, డా.రాజుకుమార్, హెచ్‌ఈఓ రాములు, ఆయుష్ సిబ్బంది మధుసూదన్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.